Parliament: లోక్ సభలో విపక్షాల వీధి నాటకం.. రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలపై నెటిజన్ల ఫైర్! | | ACTPnews

credit: NBT


Last Updated:

గోదావరి నదికి అకస్మాత్తుగా వరద పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక క్వారీలో 38 మంది కూలీలు చిక్కుకుపోయారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి.

credit: NBT
credit: NBT

దేశ అత్యున్నత చట్టసభ.. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వేదిక. అక్కడ ఏం జరిగినా దేశవ్యాప్తంగా పెద్ద వార్తే. కానీ, ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఒక వింత నాటకం చోటుచేసుకుంది. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణల పేరిట ప్రతిపక్ష ఎంపీలు చేసిన ఈ ‘చందా దొంగతనం’ డ్రామా పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌కు చెందిన ఎంపీ పప్పు యాదవ్ ఒక పూజారి వేషం వేసుకుని కాషాయ వస్త్రాల్లో రావడం, ఒక దొంగ చందా పెట్టెను పెట్టుకుని కూర్చోవడం, సాక్షాత్తూ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అందులో డబ్బులు వేసి ఈ నాటకానికి వత్తాసు పలకడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఆ తరువాత ఆ చందా పెట్టెను పప్పు యాదవ్ ఎత్తుకుపోవడం లాంటి చౌకబారు ప్రహసనాలు చూసి సామాన్య ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశ సమస్యలపై పార్లమెంటు లోపల మాట్లాడటానికే కదా.. వారిని ఎంపీ చేసింది ఇలా వీధిలో నాటకాలు వేయడానికా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

“ఇదేనా ఐదు దశాబ్దాలు పాలించిన పార్టీకి ఉన్న క్రమశిక్షణ? పార్లమెంట్ లోపల గొంతు ఎత్తలేక, బయట ఇలాంటి డ్రామాలు వేయడం ప్రతిపక్ష నేత స్థాయికి తగునా?” అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ గౌరవాన్ని మంటగలిపేలా కాషాయ వస్త్రాలను కించపరుస్తూ చేసిన ఈ నాటకం పట్ల స్పీకర్ ఓం బిర్లా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి వేషధారణలతో రావడం ఏంటని ఆయన ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు.

ప్రజా సమస్యలపై పోరాడటం ప్రతిపక్షాల బాధ్యతే. కానీ అందుకోసం పార్లమెంట్ వేదికను వీధి నాటకాలకు, చౌకబారు ట్రిక్స్‌కు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీకి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *