పలువురు సినీ తారల రాకతో బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి మండపం దేదీప్యమానంగా వెలిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నాగచైతన్య దంపతులు ప్రత్యేకంగా విచ్చేసి దంపతులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, బహుముఖ నటుడు తనికెళ్ల భరణి, హీరో శ్రీకాంత్, సునీల్ తదితర ప్రముఖులు హాజరై బండ్ల గణేష్ కుటుంబానికి తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు.













