Last Updated:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సినిమాకు సీక్వల్ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. మరి ఆ వివరాలు చూద్దామా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలై విభిన్నమైన టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ పవర్ఫుల్ విలన్‌గా మెప్పించారు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయినా, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్, ఎలివేషన్స్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ సినిమాకు సీక్వల్ రెడీ చేస్తున్నారట.
నిజానికి ఓజీ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే దర్శకుడు సుజీత్ దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ‘ఓజీ’ పార్ట్-2 ఉంటుందని వెల్లడించారు. కానీ, తదనంతర పరిణామాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అత్యంత బిజీగా మారడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టడంతో, ‘ఓజీ 2’ సినిమా అసలు పట్టాలెక్కుతుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి. అలాంటి తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026
‘ఇచ్చిన మాట ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తారు. అయితే షూటింగ్ ఎప్పుడు అనేది ఆయనే స్వయంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై తుది చర్చలు మొదలవుతాయి’ అంటూ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో ‘ఓజీ 2’ కచ్చితంగా ఉండబోతోందనే విషయంపై మేకర్స్ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం దర్శకుడు సుజీత్.. నేచురల్ స్టార్ నానితో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. సుజీత్ ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే, పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఓజీ 2’ స్క్రిప్ట్ పనులను తుది దశకు చేర్చి, ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అధికారిక ప్రకటనతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 12, 2026 11:05 AM IST













