వైద్య నిపుణుల ప్రకారం.. రొటేటర్ కఫ్ అనేది భుజం కీలును స్థిరంగా ఉంచే కండరాలు, బంధన కణజాలాల (Tendons) సమూహం. ఇది చిట్లినప్పుడు తీవ్రమైన నొప్పి, చేతులు పైకి లేపలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. పవన్ కళ్యాణ్‌కు గత 15 ఏళ్లుగా నడుము, భుజాల నొప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పలు సినిమాల షూటింగ్‌ల సమయంలో, ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్ వేళ గుజరాత్లో గుర్రంపై నుంచి కింద పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లోనే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పినా, నిర్మాతల శ్రేయస్సు కోరి అప్పట్లో సర్జరీని వాయిదా వేశారు. ఇప్పుడు కూడా అదే రీతిన ప్రజా సంక్షేమం కోసం తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టడం విశేషం.













