Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews

Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! |


Last Updated: Apr 28, 2026, 19:21 IST

అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్ సెంటర్ను “చిన్న రేకుల షెడ్డు” అని ఎద్దేవా చేసిన జగన్, ఇప్పుడు క్రెడిట్ కొట్టేయాలని చూడటం హాస్యాస్పదమన్నారు. అమరరాజా వంటి పరిశ్రమలను రాష్ట్రం నుండి తరిమేసిన చరిత్ర జగన్దేనని, మెడికల్ కాలేజీల టెండర్లను అడ్డుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయని, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తుందని పయ్యావుల స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed