Peddi Collections: పెద్ది ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? బుచ్చిమావా, నీ లెక్కే వేరులే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది. ఈ రోజే థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా నిన్న వేసిన ప్రీమియర్స్ ద్వారానే భారీ వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం టాలీవుడ్ లోకం ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు పెద్ది మూవీ థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. తొలి షో తోనే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో టాలీవుడ్ సర్కిల్స్ లో పెద్ది హాట్ టాపిక్ అయింది.

విడుదలకు ముందే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడంతో ఈ సినిమా ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద క్రేజీ కలెక్షన్స్ నమోదయ్యాయి. ట్రేడ్ పోర్టల్స్ లెక్కల ప్రకారం.. జూన్ 3వ తేదీ వేసిన ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ రూ. 20.12 కోట్లు అని తెలుస్తోంది. ఏపీలో ఈ సినిమా టికెట్ రేట్స్ హైక్ విషయంలో ప్రభుత్వం నుంచి జీవో ముందుగా రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి. దీంతో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రీమియర్స్ ద్వారా 10.33 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

అయితే ప్రీమియర్స్ వేసే కొన్ని గంటల ముందు తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడం వల్ల ఇక్కడ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు. నైజాం నుంచి ప్రీమియర్స్ ద్వారా 6.46 కోట్లు రాగా.. కర్ణాటక నుంచి 3 కోట్లు వచ్చాయి. టోటల్ గా చూస్తే ఆల్ ఇండియా ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ 20.12 కోట్లు.

మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరిగాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో, ఈ చిత్రం రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల (1 Million) గ్రాస్ మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రాజమౌళి విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత, కేవలం ప్రీమియర్ షోల బుకింగ్స్ ద్వారానే రామ్ చరణ్‌కు ఈ స్థాయి వన్ మిలియన్ మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు ఈ వసూళ్లే నిదర్శనమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports