Last Updated:
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, పాటలు గట్రా సినిమా లవర్స్‌లో మాములు ఎగ్‌జైట్‌మెంట్ క్రియేట్ చేయలేదు.
అసలు పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ తర్వాత మెగా ఫ్యాన్స్ మనసు మనసులో లేదంటే నమ్ము. అప్పటికే గేమ్ ఛేంజర్ చేసిన గాయాన్ని ఎలా మరిచిపోవాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న చెర్రీ ఫ్యాన్స్‌కు పెద్ది ఫస్ట్ షాట్ ఒక రేంజ్ హై ఇచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా చికిరీ చికిరీ, రై రై రారా పాటలు అమాంతం అంచనాలు పెంచేశాయి. అసలు ఆ రెండు పాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లు అనిపిస్తుంది. అంత టెర్రిఫిక్‌గా రెహమాన్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు.
ఇంకెక్కడి రెహమాన్‌రా బాబూ.. ఆయన సంగీతానికి కాలం చెల్లిందంటూ వస్తున్న విమర్శలకు పెద్ది పాటలతో నోళ్ళు లాక్ చేసుకునేలా చేశాడు. ఇక ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డీల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. జీ తెలుగు సంస్థ ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసుకుందట. అన్ని భాషలకు కలిపి జీ సంస్థ దాదాపు రూ.70 కోట్లు డీల్ క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుందట. ముందుగా నాన్ థియేట్రికల్ హక్కుల గురించి తెలుసుకుందాం. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా, అన్ని భాషలకు కలిపి రూ.120 కోట్ల డీల్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆడియో రైట్స్ రూపంలో ఆల్రెడీ రూ.35 కోట్లు టీ సిరీస్ నుంచి మేకర్స్ వచ్చేశాయి. ఇలా నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు రూ.220 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుంది.
ఇక థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ సినిమాకు అక్షరాల రూ.300 కోట్ల బిజినెస్ జరుగుతుందని టాలీవుడ్ ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ నుంచి రూ.40 కోట్ల డీల్ కంప్లీట్ అయిపోయింది. కర్ణాటక నుంచి రూ.23 కోట్ల డీల్ క్లోజ్ చేసుకుని అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందట. ఇక నైజాంలో ఈ సినిమాకు రూ.65 కోట్ల వరకు డీల్ క్లోజ్ చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సీడెడ్ రూ.35 కోట్లు, కోస్టల్ ఆంధ్ర రూ.85 కోట్ల వరకు రేటును పలికే ఛాన్స్ ఉందట. హిందీ మార్కెట్‌లో కూడా పెద్దిపై బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. ఇలా మొత్తంగా చూసుకుంటే రూ.300 కోట్ల మార్క్ టచ్ చేసేలానే కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాకు రూ.250 నుంచి రూ.280 కోట్ల మధ్య బడ్జెట్ అయిందని తెలుస్తుంది. ప్రమోషన్లు గట్రా కలిపి ఇంకో రూ.20 కోట్లు వేసుకున్నా.. రూ.300 కోట్లలోపే. అలా మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌లు కలిపి రూ.520 కోట్ల వరకు జరిగే ఛాన్స్ ఉంది. అంటే దాదాపు నిర్మాతలకు ఆల్రెడీ రూ.220 కోట్ల టేబుల్ ఫ్రాఫిట్‌తోనే ఈ ఈ సినిమాను రిలీజ్ చేస్తారు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 17, 2026 12:44 PM IST













