Last Updated:
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. నేటి నుంచి పెద్ది మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. అది కూడా మరింత స్పెషల్‌గా. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వెండితెరపై తన అద్భుతమైన నటనతో, కళ్లు చెదిరే మాస్ అవతార్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పైకి వచ్చేసింది. అదేనండీ, ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రాగా.. థియేటర్ వర్షన్ తో పోలిస్తే ఓటీటీ వర్షన్ లో కొన్ని డిలీటెడ్ సీన్స్ యాడ్ చేసినట్లు సమాచారం.
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని జాతీయ అవార్డు సాధించిన యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా సినిమా, ప్రస్తుతం ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. ముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ (నెట్ఫ్లిక్) లో నేటి నుంచి పెద్ది మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగా ఉన్న అపారమైన క్రేజ్ దృష్ట్యా ఈ ఓటీటీ రిలీజ్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ భారీ స్థాయిలో నిర్మించగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి. గ్రామీణ నేపథ్యం, పక్కా మాస్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని సరికొత్త మేకోవర్‌లో, అత్యంత రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి అభిమానులను మెప్పించారు. బుచ్చిబాబు సన వినూత్న టేకింగ్, సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే, చరణ్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొనగా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ రికార్డు స్థాయి ధరకు ‘పెద్ది’ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు, అలాగే రామ్ చరణ్ మాస్ విశ్వరూపాన్ని కుటుంబ సమేతంగా ఇంట్లో మళ్లీ మళ్లీ చూడాలనుకునే సినీ అభిమానులు ఇప్పుడీ సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













