Last Updated:
రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే డిజిటల్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో, నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్-10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో నంబర్-1 స్థానానికి వెళ్ళింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ తాజాగా ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా, డిజిటల్ వేదికపై కూడా సత్తా చాటుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీలో విడుదలైన కొన్ని గంటల్లోనే డిజిటల్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో, నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్-10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో నంబర్-1 స్థానానికి వెళ్లడం విశేషం.
భారీ అంచనాల నడుమ జూన్ 4, 2026న థియేటర్లలో విడుదలైన ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ఈ ఏడాది టాలీవుడ్‌లో భారీ కమర్షియల్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు థియేటర్లలో మిస్ అయిన వారే కాకుండా, సినిమాను మళ్ళీ చూడాలనుకునే అభిమానులు కూడా ఓటీటీకి క్యూ కడుతుండటంతో ‘పెద్ది’ వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, త్వరలోనే హిందీ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది.
ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ భారీ స్థాయిలో నిర్మించగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి. గ్రామీణ నేపథ్యం, పక్కా మాస్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని సరికొత్త మేకోవర్‌లో, అత్యంత రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి అభిమానులను మెప్పించారు. బుచ్చిబాబు సన వినూత్న టేకింగ్, సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే, చరణ్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సో, ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ మీరు ఈ సినిమా చూడలేందంటే వెంటనే ఓటీటీలో చూసేయండి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














