Peddi Public Talk: రైలు ఆపే సీన్, డెడ్‌బాడీ సన్నివేశం.. పెద్ది సినిమాలో హైలైట్స్ ఇవే, పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Peddi


Last Updated:

ఆ ఒక్క సీన్‌కే టికెట్ డబ్బులు వసూల్.. ‘పెద్ది’లో జగపతిబాబును చూస్తే కన్నీళ్లు ఆగవు!

+

Peddi Public Talk: రైలు ఆపే సీన్, డెడ్‌బాడీ సన్నివేశం.. పెద్ది సినిమాలో హైలైట్స్ ఇవే, పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రాజోలు, పిఠాపురం, తుని, మండపేట తదితర ప్రధాన కేంద్రాల్లో గత రాత్రి ప్రదర్శించిన ప్రత్యేక షోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా చూసిన పబ్లిక్ అంతా ముక్తకంఠంతో సూపర్ హిట్ అంటూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

కనీసం ఓ గుర్తింపు కార్డు కూడా లేని ఒక యువకుడు తన కొండ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి చేసిన పోరాటమే ఈ ‘పెద్ది’. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో ఒకవైపు క్రికెట్ ఆడుతూనే, మరోవైపు కుస్తీ పడుతూ అద్భుతమైన క్రీడాకారుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. కథలో సరికొత్తదనం చూపిస్తూ దర్శకుడు బుచ్చిబాబు పక్కా నెటివిటీతో తనదైన శైలిలో చిత్రాన్ని తీసిన తీరుకు థియేటర్లలో చప్పట్లు, ఈలలు మారుమోగుతున్నాయి.

ఇది కూడా చదవండి: PMAY: ఇకపై వారి అకౌంట్లలోకి రూ.2 లక్షల 39 వేలు.. ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!

రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తి ఊర మాస్ గెటప్‌లో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించాడు. అతడి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసిన తీరు, డైలాగ్ డెలివరీ, మాట, ఆట, పాట అంతా పక్కా మాస్ కల్చర్‌ను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే హీరోయిన్ పాత్ర కూడా సినిమాకు ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె పొలిటికల్ ప్రచారం నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు హీరోయిన్‌ను రామ్ చరణ్ ప్రాణాలకు తెగించి కాపాడుకునే సన్నివేశాన్ని దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడు.

ఇది కూడా చదవండి: Shukra Gochar: జూన్ 8 తర్వాత ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఉద్యోగం, డబ్బు, కీర్తి.. తిరుగులేని అదృష్టం!

కథలో మాస్ అంశాలతో పాటు గుండెను పిండేసే బలమైన భావోద్వేగాలు కూడా అద్భుతంగా పండాయి. కొండ ప్రాంతంలో కనీసం ఒక్క రైలు అయినా ఆపాలని 30 ఏళ్లుగా ఎర్ర జెండా పట్టుకుని ఎదురుచూసే పాత్రలో జగపతిబాబు నటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆయన మరణానంతరం రామ్ చరణ్ తో కలిసి కొండ గ్రామస్తులు రైలు పట్టాలను తొలగించడం, ఆ తర్వాత పోలీసులు వారిని దారుణంగా ఇబ్బంది పెట్టడం లాంటి సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. చివరకు కనీసం గుర్తింపు కార్డు లేదనే కారణంతో శవాన్ని కూడా అప్పగించకపోవడం లాంటి సీన్స్ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి.

సినిమా ఘనవిజయం సాధించడంతో థియేటర్ల ప్రాంగణాల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తూ, రామ్ చరణ్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఈ సందడి వాతావరణం మరింత అంబరాన్ని అంటింది. బుచ్చిబాబు తమ హీరోకు కళ్లుచెదిరే సూపర్ హిట్ ఇచ్చాడని ఆనందంతో ఫ్యాన్స్ కటౌట్లకు హారతులు ఇస్తూ, దిష్టి తీస్తున్నారు. మొత్తానికి 2026 సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా ‘పెద్ది’ ఏపీవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports