Last Updated:
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన పెద్ది సినిమా నేడు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై రిపోర్ట్ ఇస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. నేడు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీమియర్స్, ప్రెస్ షోస్ నిన్న (బుధవారం) రాత్రి పడ్డాయి. ఈ స్పెషల్ ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మరి ఆ కామెంట్స్ చూద్దామా..
ఊరు కోసం జీవితంతో పోరాడే కుర్రాడి కథ ఇది.. రామ చరణ్ వన్ మ్యాన్ షో అంతే. ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ గా ఉన్నా సెకండాఫ్ మాత్రం ఇరగదీశారు. సెకండాఫ్ గురించి చెప్పాలంటే మాటలు కూడా చాలవు. లాస్ట్ గంట సేపు అయితే మాములుగా లేదు. మొత్తంగా చెప్పాలంటే చూడాల్సిన సినిమా అంటున్నారు కొందరు.
#Peddi A watchable commercial entertainer with an honest story that works in parts despite its regular template narration!
The first half is fairly average with template commercial elements, and Jahnvi’s track doesn’t work. However, the stretch from the pre-interval to the end…— Venky Reviews (@venkyreviews) June 3, 2026
సాధారణ కథాంశంతోనే సినిమా స్టార్ట్ అయింది కానీ, కథలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ కలిగిందని.. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయని కొందరు చెప్తున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన బలం అనే టాక్ కూడా వచ్చింది.
విడుదలకు ముందే ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లగా, తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుండి వచ్చిన ‘ఇన్‌సైడ్ రిపోర్ట్’ సినిమా రేంజ్ పెంచేసింది. ఈ పరిస్థితుల నడుమ నేడు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే పాజిటివ్ బజ్ అయితే తెచ్చుకుంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana











