Last Updated:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పవర్ఫుల్ వీడియో వదిలి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ సాలిడ్ అప్డేట్స్ అందిస్తున్నారు. మే 18న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో, తాజాగా కన్నడ కరుణాడ చక్రవర్తి, శివరాజ్‌కుమార్ పాత్రకు సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసి సర్ ప్రైజ్ చేశారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శివరాజ్‌కుమార్ ‘గౌరనాయుడు’ అనే అత్యంత కీలకమైన, శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఓ కఠినమైన, అనుభవజ్ఞుడైన రెజ్లింగ్ కోచ్‌గా కనిపించనున్నారు. ఒక సాధారణ అథ్లెట్ లేదా క్రికెటర్‌గా ఉండే రామ్ చరణ్ పాత్రను, సంప్రదాయ మట్టి కుస్తీలో ఒక తిరుగులేని యోధుడిగా ఎలా మలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని సమాచారం. శివన్న లుక్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు డెప్త్ ఆఫ్ ఎమోషన్స్‌ను క్యారీ చేస్తోంది. ఆయన తన శిష్యుడికి ఇచ్చే ట్రైనింగ్ సీన్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయని తాజా వీడియో చూస్తే అర్థమవుతోంది.
మేకర్స్ విడుదల చేసిన వీడియోలో శివరాజ్‌కుమార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. గౌరనాయుడిగా ఆయన కళ్ళు మాత్రమే మాట్లాడేలా ఉన్న ఇంటెన్సిటీ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి తోడు మేకింగ్ విజువల్స్, రామ్ చరణ్ – శివరాజ్ కుమార్ కాంబినేషన్ సన్నివేశాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరి మధ్య గురుశిష్యుల బంధం, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక అందరి దృష్టి మే 18న రాబోతున్న థియేట్రికల్ ట్రైలర్‌పైనే ఉంది. ఈ ట్రైలర్ సినిమా స్థాయిని, కథా నేపథ్యాన్ని మరింత స్పష్టంగా తెలియజేయనుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని స్వచ్ఛమైన గోదావరి పల్లెటూరి నేపథ్యంతో, పచ్చి కుస్తీ క్రీడను, బలమైన భావోద్వేగాలను కలగలిపి తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది ఒక ల్యాండ్‌మార్క్ మూవీ అవుతుందని, ఆయన నటనకు జాతీయ స్థాయి అవార్డులు రావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి స్టెల్లార్ కాస్ట్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు సోల్ కానుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘పెద్ది’, ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













