మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఆయన వివరించారు. హోంగార్డులకు కనీసం డీఏ (DA) కూడా ఇవ్వడం లేదని, జిల్లాల్లో బందోబస్తు విధిస్తే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. కానిస్టేబుళ్ల తరహాలో వీరికి ఎలాంటి ఆరోగ్య భద్రత లేదని, పొరపాటున ఎవరైనా చనిపోతే తోటి హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం హోంగార్డుల జీతాన్ని రూ.21 వేలకు పెంచిందని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం హోంగార్డుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని పేర్ని నాని విమర్శించారు.
Source link
Perni Nani | హోంగార్డుల దుస్థితిపై పేర్ని నాని ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

తండ్రి అంత్యక్రియలకు అనుమతి ఇవ్వండి.. పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న దళిత యువకుడు..! | | ACTPnews
-

సౌత్ ఇండియన్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా.. మనసులో మాట చెప్పిన నిథి అగర్వాల్..! nidhi agarwal wedding wish south indian boy. | | ACTPnews
-

Murder: తల్లిని చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా డ్రామా! చివరకు అడ్డంగా బుక్ అయ్యింది.. మర్డర్ ఎందుకు చేసిందో తెలిసి షాక్ అయిన పోలీసులు | | ACTPnews
-

Iron-US Hight Tension: ఇరాన్‌పై ఈ రాత్రే దాడి చేస్తాం.. ట్రంప్ హెచ్చరిక.. ‘నువ్వు ఏం చేయలేవు’ ఆ దేశం ఎటాక్ | | ACTPnews
-

Kriti Sanon: పెళ్లి, పిల్లలపై క్రితి సనన్ ఊహించని ట్విస్ట్.. ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు ఓపెన్ స్టేట్మెంట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews





