మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఆయన వివరించారు. హోంగార్డులకు కనీసం డీఏ (DA) కూడా ఇవ్వడం లేదని, జిల్లాల్లో బందోబస్తు విధిస్తే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. కానిస్టేబుళ్ల తరహాలో వీరికి ఎలాంటి ఆరోగ్య భద్రత లేదని, పొరపాటున ఎవరైనా చనిపోతే తోటి హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం హోంగార్డుల జీతాన్ని రూ.21 వేలకు పెంచిందని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం హోంగార్డుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని పేర్ని నాని విమర్శించారు.
Source link
Perni Nani | హోంగార్డుల దుస్థితిపై పేర్ని నాని ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

India vs England T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంపిక | క్రీడా వార్తలు | ACTPnews
-

Tirumala: భక్తులకు గుడ్న్యూస్.. తిరుమలలో 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి..! Tirumala Electric Buses | | ACTPnews
-

JNVST Class 6 Admission: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ 6th క్లాస్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం | | ACTPnews
-

Ice Skating: 4 ఏళ్లకే స్కేటింగ్.. ఇప్పుడు వరుసగా ఐదేళ్లు జాతీయ ఛాంపియన్.. భారత యువ సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews
-






