Last Updated:
Pithapuram Politics: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి అంతా సవ్యంగా, నేతల సఖ్యతతో ఉంటుందని అనుకున్నారు. కాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి.
Pithapuram Politics: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి అంతా సవ్యంగా, నేతల సఖ్యతతో ఉంటుందని అనుకున్నారు. కాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి అది పవన్ కల్యాణ్ తాలుకా అయినప్పటికి గతంలో మాత్రం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్ వర్మది అనే చెబుతారు. తాజగా పిఠాపురం నుంచి కాకినాడకు షిఫ్ట్ అయిన వర్మకు ఓదార్పు లభిస్తుందా..? పార్టీ నేతల నుంచి కాదు, ప్రజల నుంచి ఓదార్పు పెరుగుతోంది అనే ప్రచారం జోరందుకుంది. నమ్మిన కార్యకర్తల కోసం ఏమైనా చేస్తానని వర్మ చెప్పినట్లుగా తెలుస్తోంది. రీసెంట్‌గా వర్మ పుట్టిన రోజు వేడుకలకు సైతం ఆయన దూరంగా ఉన్నప్పటికి ఆయన అభిమానులు మాత్రం ఓ పండగలా జరుపుకున్నారు. వర్మ పిఠాపురం నుండి కాకినాడకు షిప్ట్ అవడంతో ఆయన్ని కలవడానికి నియోజకవర్గ అభిమానులు కాకినాడకు క్యూ కడుతున్నారు. అసలు ఇదంతా దేనికి జరుగుతోంది..? దీని వెనుక వర్మ వ్యూహం ఏంటీ..? భవిష్యత్తులో వర్మ ఏం చేస్తారనే సందేహాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుండి నేటి వరకు పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకంగా మారింది. దీనికి కారణం అక్కడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కాకుండా పవన్ కల్యాణ్ పోటీ చేయడం విజయం సాధించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం పవన్ కల్యాణ్ కి కేటాయించడంతో చంద్రబాబు మాటకు కట్టుబడి వర్మ తన సీటును త్యాగం చేశారు. జనసేనను గెలిపించడానికి తన వంతు కృషి చేశారు. అయితే ఇదంతా పాత కథే అయినప్పటికి తన సీటు త్యాగం చేసిన వర్మకు సొంత కూటమిలోనే ప్రత్యర్ధులు తయారయ్యారు. ఆ పరిస్థితులు ఆయన్ని కొంత ఆగ్రహానికి, మరికొన్ని సార్లు దూకుడు ప్రదర్శించడానికి కారణమయ్యాయి. వర్మ కంటే పవన్ కల్యాణ్ ఎక్కువగా భావించిన టీడీపీ అధినేత వర్మను పలుమార్లు మందలించడమే కాకుండా నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతల నుండి కూడా తప్పించారు. పదవులు లేక పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టడంతో వర్మ పిఠాపురం నుండి కాకినాడకు షిప్ట్ అయ్యారు.
వర్మ కాకినాడకు మకాం మార్చడంతో పిఠాపురంలోని ఆయన అభిమానులు, సన్నిహితులు, మద్దతుదారులు ఇప్పుడు నివాసానికి వెళ్లి మరీ కలుస్తున్నారు. ప్రతిరోజు వర్మ నివాసం వద్దకు మహిళలు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు వెళ్లడంతో దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ చర్చ జోరుగా సాగుతుంది. ఇలాంటి సమయంలో నమ్ముకున్న కార్యకర్తల కోసం తాను ఎప్పడూ అండగా ఉంటానని వర్మ చెప్పడమే కాకుండా తన వాళ్లు లేకుండా పుట్టిన రోజు వేడుకలు మాత్రం దేనికి అంటూ బర్త్ డే వేడుకలు జరుపుకోవద్దనుకున్నారు.
ఈ విషయంలో వర్మ వ్యూహం చాలా తెలివిగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వర్మ కాకినాడ వెళ్లిన అక్కడికి తెలుగు తమ్ముళ్లు వెళ్తున్నారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది అంటూ గుసగుసలాడుతున్నారు. అయితే వర్మ తాను ఎప్పుడూ చంద్రబాబుకు నమ్మిన బంటునే అంటూ చెప్పుకుంటున్నప్పటికి తెరవెనక ఏదైనా జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో వర్మ పాత్ర లేకపోతే కూటమి పార్టీలకు ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎవరున్నా లేకపోయినా నూటికి నూరు శాతం గెలిచి తీరుతామంటూ జనసైనికులు హామీ ఇస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం పిఠాపురం రాజకీయం కాకినాడ వైపు మళ్లింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh












