Rahul Gandhi High Voltage Drama: "దమ్ముంటే రండి" పోలీసులపై విరుచుకుపడ్డ రాహుల్ | ACTPnews

Rahul Gandhi High Voltage Drama: "దమ్ముంటే రండి" పోలీసులపై విరుచుకుపడ్డ రాహుల్



ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య హైడ్రామా తీవ్రస్థాయికి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. “దమ్ముంటే ముందుకు రండి” అంటూ పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు రక్షణ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పాటు ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులోకి తరలించారు. బస్సు కిటికీ నుంచి కూడా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుపై, ఈసీపై విమర్శలు గుప్పించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగింది. #RahulGandhi #CongressProtest #DelhiPolice



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports