PM Modi: ప్రధాని మోదీ అత్యంత టెక్-సావి.. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

News18


Last Updated:

DELHI: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత టెక్-సావి (సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న వ్యక్తి) అని, చాలా మంది కంటే వేగంగా సాంకేతిక ఆవిష్కరణలను గుర్తిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.

News18
News18

DELHI: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత టెక్-సావి (సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న వ్యక్తి) అంటూ కితాబిచ్చారు రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్. చాలా మంది కంటే వేగంగా సాంకేతిక ఆవిష్కరణలను గుర్తిస్తారని చెప్పారు. న్యూస్ 18 నిర్వహించిన ‘డెఫ్‌కాన్ 2026’ (DEFCON 2026) సదస్సులో మాట్లాడిన ఆయన మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రక్షణ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన ప్రసంగించారు. ఆ వివరాలు వార్తల రూపంలో ఈ విధంగా ఉన్నాయి.

సాంకేతిక మార్పులపై నిఘా (హోరిజన్ స్కానింగ్): శాస్త్రవేత్తలు సాంకేతిక మార్పులను మొదటగా గుర్తించి, అర్థం చేసుకోవాలని కేంద్ర రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిణామాలు, ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు గమనించేందుకు డీఆర్‌డీఓ (DRDO) లో ప్రత్యేక యూనిట్ ఉందని, సాయుధ దళాలలో కూడా ఇలాంటి వ్యవస్థలే ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ప్రధాని మోదీ నాయకత్వం: దేశ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత టెక్-సావిగా ఆయన అభివర్ణించారు. మాలో చాలా మంది కంటే వేగంగా టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌ను ప్రధాని గుర్తిస్తాని సదస్సులో తెలిపారు. అయితే ఇది ఏ ఒక్క వ్యక్తిపై ఆధారపడి ఉండకూడదని.. దేశం వేగంగా స్పందించేలా దీన్ని ఒక వ్యవస్థీకృత విధానంగా (Institutionalise) మార్చాలని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధరంగ అనుభవాలే ప్రాతిపదిక: ప్రపంచ యుద్ధం తర్వాత ప్రస్తుతమే భౌగోళిక రాజకీయ ఘర్షణలు అత్యధిక స్థాయిలో ఉన్నాయని సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) తో పాటు సరికొత్త యుద్ధరంగ అనుభవాల నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటున్నామని ఆయన న్యూస్18 తో చెప్పారు. ఈ అనుభవాలను రక్షణ కొనుగోళ్లు, పరిశ్రమల వృద్ధికి అనుసంధానిస్తున్నట్లు తెలిపారు.

వేగవంతమైన రక్షణ కొనుగోళ్లు: రక్షణ రంగ కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికతకు సంబంధించి 6 నుంచి 8 నెలల్లో ఒప్పందాలు కుదుర్చుకుని, రెండేళ్లలోగా డెలివరీలు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. గత రెండేళ్లలో రక్షణ ఆర్డర్ల వేగాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచిందని, ఏటా రూ. 50,000 నుంచి రూ. 80,000 కోట్ల మధ్య ఉండే ట్రెండ్ నుంచి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల వరకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

ఆర్థిక అధికారాల పెంపు: ప్రస్తుతం రూ. 3,000 కోట్లకు పైబడిన కాంట్రాక్టులన్నింటికీ కేబినెట్ ఆమోదం అవసరమవుతోందని, భవిష్యత్తులో రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఆర్థిక అధికారాల పరిమితిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాజేష్ కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలను సమన్వయం చేస్తూ పెద్దఎత్తున డిఫెన్స్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌ను నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed