జూన్ 29న మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 135వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బంగారం కొనవద్దనీ, కార్ పూలింగ్ చెయ్యాలని చెప్పాననీ, అలాగే.. విదేశీ పర్యటనలను మానుకోవాలని కోరాననీ, వ్యవసాయంలో కూడా ఎరువుల వాడకం తగ్గించాలని కోరగా.. ప్రజలు ఇవన్నీ పాటించారనీ.. దీని వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందని మోదీ అన్నారు. ఇలా తన పిలుపును పాటిస్తూ.. ఈ ఇరాన్ యుద్ధ సంక్షోభ కాలంలో కేంద్ర ప్రభుత్వానికీ, దేశానికీ అండగా నిలుస్తున్నందుకు.. ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని మోదీ అన్నారు.













