PM Modi : పారిస్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు! | ACTPnews

PM Modi  : పారిస్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!



ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులను (ఇండియన్ డయాస్పోరా) ఉద్దేశించి సంచలన ప్రసంగం చేశారు. గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం సాధించిన అపూర్వ అభివృద్ధి ప్రస్థానాన్ని ఆయన ప్రపంచ వేదికపై వివరించారు. ఈ 12 ఏళ్ల కాలం 140 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కాలంలో దేశ జీడీపీ (GDP), విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల సంఖ్య రెట్టింపు అయ్యాయని.. రహదారుల నిర్మాణం మూడింతలు, మెట్రో నెట్వర్క్ నాలుగింతలు పెరిగాయని చెబుతూ.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *