Last Updated:
PM Narendra Modi: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ.. మన ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడితే ఏంటి సమస్య? ఇజ్రాయెల్ మనకి మిత్ర దేశమే కదా? మరి ఎందుకు టెన్షన్? దీని వెనక జరుగుతున్న ప్రమాదకర పరిణామం ఏంటో తెలుసుకుందాం.
మనం ఓ రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటాం. కాస్త దూరంలో ఓ వ్యక్తి మనకు ఎదురుగా వస్తూ ఉండటాన్ని చూస్తాం.. వెంటనే.. “అమ్మో వీడా.. వీడికి దొరికితే మన పని అయిపోతుంది.. ఎందుకొచ్చిన గోల.. ఈ సందులోంచీ పోదాం” అనుకొని.. పక్క సందు నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. ఇంతలోనే అతను మనల్ని చూసేస్తాడు.. చూడటమే కాదు.. నవ్వుతూ పలకరిస్తూ.. గబగబా దగ్గరకు వచ్చేస్తాడు.. అప్పుడు మనం మనసులో.. “అయిపోయాను.. ఈ రోజు నాకు బ్యాడ్ డే” అని అనుకుంటాం. ఎందుకంటే.. ఆ వ్యక్తి మనకు తగలడం డేంజర్. అతని వల్ల మనకు అన్నీ నష్టాలే ఉంటాయి.. కానీ అతనికి మన వల్ల అన్నీ లాభాలే ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.














