Last Updated:
PM Narendra Modi: తాము పనిచేసే దేశాల్లోని స్థానిక ప్రజలు, వివిధ సామాజిక వర్గాలు, ఇతర కమ్యూనిటీలతో IFS అధికారులు సన్నిహితంగా మెలగడం ద్వారా భారతదేశంపై మరింత మంచి అవగాహన, విశ్వాసం ఏర్పడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: భారత విదేశాంగ సేవ (IFS)లో 2025 బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ ట్రైనీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం, ఆగస్టు 24న సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో జరిగిన ఈ భేటీలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 50 మంది IFS ఆఫీసర్ ట్రైనీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోయే యువ దౌత్యవేత్తలకు ప్రధాని కీలక సూచనలు చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.














