PM Narendra Modi: వికసిత్ భారత్ సాధించి తీరుతామన్న మోదీ.. వికసిత్ భారత్ సంకల్ప్ సభలో ప్రధాని పదునైన మాటలు | | ACTPnews

PM Narendra Modi


Last Updated:

PM Narendra Modi: ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రసంగించారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేశారు. మేము దాన్ని సాధించి తీరుతామని తెలిపారు.

PM Narendra Modi
PM Narendra Modi

PM Narendra Modi: ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రసంగించారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేశారు. మేము దాన్ని సాధించి తీరుతామని తెలిపారు. ప్రభుత్వ సారథ్యంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు, ఎన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలకు నివాళులర్పిస్తూ “2047 నాటికి వికసిత్ భారత్‌ని సాధిస్తామన్నారు.

వికసిత్ సంకల్ప సభలో మోదీ..

బుధవారం అక్టోబర్ 7 అంటే నేటితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. భారతదేశ అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తూ “2047 నాటికి వికసిత్ భారత్ ను సాధిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో ప్రసంగించిన ప్రధాని మోదీ, అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ భారతావనిని నిర్మించాలన్న తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. అదే సమయంలో ప్రజలు తనపై ఉంచిన నిరంతర విశ్వాసానికి, అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ దేశం ఎంతో ఇచ్చిందని.. అందుకే తన మొదటి ప్రాధాన్యత దేశం, దేశ ప్రగతి అంటూ చెప్పుకొచ్చారు మోదీ.

వికసిత్ భారత్ లక్ష్యం..

2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) – మనం దీన్ని సాధించి తీరుతామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్! ప్రపంచ తయారీ కేంద్రం! ఒలింపిక్స్ నిర్వహణ! అంతరిక్షంలోకి అడుగుపెట్టడం! ఈ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అద్భుతమైనవి,” అని ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మొదలైన తన ప్రభుత్వ సారథ్య ప్రయాణంలో, ప్రధానమంత్రి 25 ఏళ్ల సుదీర్ఘ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత 2014లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి మూడు పర్యాయాలు ఆ పదవిని నిర్వహించారు.

పాతికేళ్ల అనుభవాలు..

అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తాను ఎప్పుడైనా ఈ మైలురాయిని చేరుకుంటానని అస్సలు ఊహించలేదన్నారు ప్రధాని మోదీ. ఈ రోజు నేను 25 ఏళ్ల నిరంతర సేవను పూర్తి చేసుకున్నానని… ఇది ప్రజల నిరంతర ఆశీస్సులు, మద్దతు ఫలితమేనని చెప్పారు. అందుకే నా దేశ ప్రజల ముందు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఇక తన రాజకీయ పురోగతికి ప్రత్యర్ధులే కారణమని తెలిపారు ప్రధాని మోదీ. తన 25 ఏళ్ల ప్రయాణంలో ప్రజలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ప్రధాని మోదీ ఈ మైలురాయి తన వ్యక్తిగత విజయం కాదని, పౌరుల నుండి తనకు లభించిన నమ్మకం, ఆశీస్సుల ఫలితమని అన్నారు.

దేశ ప్రజల రుణం తీర్చు తీర్చుకోలేనిది..

సభలో ప్రజల మద్దతును పదే పదే గుర్తు చేసుకున్న మోదీ దేశ ప్రజలందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన దేశ దేశ ప్రజల ముందు నేను శిరసు వంచి నమస్కరించారు. తన రాజకీయ ఎదుగుదలకు, నాయకత్వాన్ని నమ్మి తమ మద్దతు అందించినందుకు ఎన్‌డిఎ (NDA) భాగస్వామ్య పక్షాలన్నింటికీ కూడా ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో జరిగిన ఎన్నికలను గుర్తుచేసుకుంటూ, ప్రజలు తనకు సేవ చేసే అవకాశాన్ని పదేపదే కల్పించారని ప్రధాని మోదీ అన్నారు.

నా ఎదుగుదలకు ప్రత్యర్ధులు కూడా కారణం..

ఈ పాతికేళ్ల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు లేదా లోక్‌సభ ఎన్నికలు – ఏవైనా సరే, ప్రజలు నాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఈ రోజు, నేను భారతదేశ ప్రజాస్వామ్యానికి ,రాజ్యాంగానికి నివాళులు అర్పిస్తున్నట్లుగా తెలిపారు. తనను వ్యతిరేకించిన వారిని కూడా ప్రస్తావించిన ప్రధానమంత్రి, ప్రజాస్వామ్య బలాన్ని అర్థం చేసుకోవడంలో వారు తనకు సహాయపడ్డారని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports