జూన్ 19న న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, “ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన” (PM-VBRY) లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన యువ ఉద్యోగులు, యాజమాన్యాలకు దాదాపు రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను బదిలీ చేశారు అని ఏఎన్ఐ’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా సుమారు 15 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యింది. దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఫార్మల్ సెక్టార్‌లో ఉద్యో్గాల్ని సృష్టించడం లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది.













