ఇంతలో తాయారు, రమణయ్య అక్కడకు వస్తారు. వాళ్లను చూసిన నారాయణ, “మీరు రాలేదేంటా అనుకున్నాను.. వచ్చారా? మా ఇంట్లో ఏం జరిగినా మీకు ముందే తెలిసిపోతుందిగా” అని వెటకారంగా మాట్లాడతాడు. కానీ తాయారు, రమణయ్య మాత్రం “పెద్దోడు వెళ్లిపోతుంటే ఏం చేస్తున్నారు?” అని సీరియస్ అవుతారు. ఇక తాయారు, “ఆ జాతకం చూసేవాడు వెళ్లిపోయాడు గానీ, నేను ముందే ఆపి ఉంటే గాయత్రితో వాడి పెళ్లి ఎప్పుడో అయిపోయేది. ఈ జాతకాలు ఏవీ నమ్మకండి, ఎక్కడికి పోతాడులే వస్తాడు” అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. (Photo Credit: podarillu Serial Star maa/ Jio + Hotstar)













