Police Complaint Review: వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హారర్, మిస్టరీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

News18
News18

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే హారర్, మిస్టరీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కథా నేపథ్యం:

ఒక గర్భిణి మహిళ దారుణ హత్యతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. క్షుద్రపూజల కోణంలో జరిగినట్టు అనుమానించే ఈ మర్డర్ మిస్టరీ కేసు కొన్ని ఏళ్లపాటు మరుగున పడిపోతుంది. అయితే, ఒక చిన్నారి పాప ‘డాడీ కావాలి’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథలో ఊహించని మలుపు వస్తుంది. ఆ పాప ఎవరినైతే డాడీ అని పిలుస్తుందో, వారంతా వరుసగా హత్యకు గురవుతుంటారు. ఈ విచిత్రమైన కేసును ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ (వరలక్ష్మి శరత్‌కుమార్). ఈ దర్యాప్తు ప్రక్రియలో ఆమె భర్త డాక్టర్ రామ్ (నవీన్ చంద్ర) అసలు స్వరూపం బయటపడుతుంది. అసలు ఈ వరుస హత్యల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? మూఢనమ్మకాలు, అవినీతి, కర్మ సిద్ధాంతం చుట్టూ అల్లుకున్న ఈ కేసును ఆ పోలీస్ అధికారిణి ఎలా ముగించిందనేదే చిత్ర ముఖ్య కథాంశం.

సినిమా విశ్లేషణ, నటీనటుల ప్రతిభ:

దర్శకుడు సంజీవ్ మేగోటి “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ” అనే వైవిధ్యమైన పాయింట్‌ను ఎంచుకుని, దానికి హారర్ ఎలిమెంట్స్‌ను జోడించి కథను గ్రిప్పింగ్‌గా నడిపించారు. ప్రథమార్ధం అంతా మిస్టరీ సీన్లతో సాగగా, ద్వితీయార్ధంలో కథనం వేగం పుంజుకుంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ తన పవర్‌ఫుల్ నటనతో మరోసారి మెప్పించగా, నవీన్ చంద్ర గంభీరమైన పాత్రలో ఒదిగిపోయారు. కృష్ణసాయి నటన, అలాగే చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా డిజైన్ చేసిన ప్రత్యేక గీతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిల కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఎక్కడో చోట బోరింగ్ అనిపించినా మొత్తంగా అయితే అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది.

ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ, సుధాకర్ మారియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని హారర్ మూడ్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. కథనంలో కొన్ని ల్యాగ్‌లు ఉన్నప్పటికీ, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఓవరాల్‌గా, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే వారికి ‘పోలీస్ కంప్లైంట్’ ఒక మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది.

రేటింగ్: 2.75

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed