Police Constable: రాత్రి ఆమెకు వీడియో కాల్ చేసిన కానిస్టేబుల్.. తర్వాత ఊహించని నిర్ణయం | తెలంగాణ వార్తలు | ACTPnews

Telangana Police Constable Death


Last Updated:

Hyderabad: తెలంగాణలో క్రైమ్ కేసులు చేధించాల్సిన పోలీసులే కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ట్రైనీ డీఎస్పీ కేసు విచారణలో ఉండగానే ఒకరిద్దరు కానిస్టేబుల్స్ ప్రాణాలు తీసుకున్న వార్తలు గడిచిన నెల రోజుల వ్యవధిలోనే అనేకం జరిగాయి.

Telangana Police Constable Death
Telangana Police Constable Death

Police Constable: పోలీస్ డ్రెస్ ఒంటిపైకి రావాలంటే కఠోర శ్రమ పడాల్సి ఉంటుంది. కఠిన ట్రైనింగ్‌తో పాటు ఫిజికల్ టెస్టులు పాసైతే కాని సమాజంలో పోలీస్ అనే బాధ్యతయుతమైన ఉద్యోగంతో పాటు ఖాకీ యూనిఫామ్ రాదు. కాని గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో పోలీసులు బలవన్మరణం చేసుకుంటున్న కేసులు పెరిగిపోయాయి. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ అనే 35ఏళ్ల వ్యక్తి

ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. అయితే అతనిది ఆత్మహత్య, లేక హత్యా అనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లోనే కానిస్టేబుల్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ చనిపోయే ముందు ఓ యువతికి కాల్ చేసి చెప్పడం ఏమిటి..? ఆ యువతి ఎవరూ అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.

పోలీస్ సూసైడ్..

తెలంగాణలో క్రైమ్ కేసులు చేధించాల్సిన పోలీసులే కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ట్రైనీ డీఎస్పీ కేసు విచారణలో ఉండగానే ఒకరిద్దరు కానిస్టేబుల్స్ ప్రాణాలు తీసుకున్న వార్తలు గడిచిన నెల రోజుల వ్యవధిలోనే అనేకం జరిగాయి. తాజాగా మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ అనే 35ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లోనే కానిస్టేబుల్ రైటర్‌ గా పని చేస్తున్న చంద్రశేఖర్ ఆదివారం అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఉరివేసుకుంటున్నట్లుగా చెప్పాడు. వెంటనే ఆ యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఆమెకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత..

యువతి ఇచ్చిన సమాచారంతో మలక్‌పేట్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మలక్‌పేట్ పోలీసులకు కేసు ట్రాన్స్‌ఫర్ చేయడంతో వాళ్లు కానిస్టేబుల్ చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే వీడియో కాల్‌లో చనిపోతున్నట్లుగా చెప్పడానికి కారణం ఏంటీ..? ఆమె ఎవరూ..? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక రాగానే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports