Prabhas: ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఫౌజీ రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రెబల్ స్టార్ ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ. ఈ సినిమా డిసెంబర్ ౩న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా దీనిపై షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.

News18
News18

పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauji) విడుదలపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో, అంటే డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు, చిత్రంలో అత్యంత కీలకమైన రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉందట. వీటితో పాటు మరికొంత ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్స్, ఎక్కువ మంది ఫైటర్స్ అవసరం కానున్నారు. ఈ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయడానికి కనీసం మరో 50 నుంచి 60 రోజుల వర్కింగ్ డేస్ పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ (VFX), ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా తగినంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక కారణాల దృష్ట్యా డిసెంబర్ 3న సినిమాను ఆదరాబాదరాగా విడుదల చేయడం కంటే, వాయిదా వేయడమే సరైన నిర్ణయమని దర్శకనిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది.

ఇక డిసెంబర్ రేసు నుంచి తప్పుకోవడంతో, మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పక్కాగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది జనవరి 26న (రిపబ్లిక్ డే సందర్భంగా) ‘ఫౌజీ’ని థియేటర్లలోకి తీసుకురావాలనే సరికొత్త ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, అందులోని కథాంశం దేశభక్తికి, ఆర్మీ నేపథ్యానికి దగ్గరగా ఉండటంతో జనవరి 26 అయితే ఈ ప్రాజెక్టుకు మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.

అంతేకాకుండా, ప్రభాస్ తదుపరి క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (దర్శకుడు సందీప్ రెడ్డి వంగా) వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఒకే హీరో నటించిన రెండు భారీ చిత్రాల మధ్య కనీస గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం బాక్సాఫీస్ పరంగా ఎంతో ముఖ్యం. అందువల్ల ఈసారి ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ప్రకటిస్తే మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ మారకూడదనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఆచితూచి అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ వాయిదా, కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed