Last Updated:
“నాయకుడికి అన్నీ తెలుసు. ఆయన మాటే శాసనం. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, ప్రశ్నించకుండా నాయకుడి మాటను అనుసరించండి” అని నాగబాబు చేసిన ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.
వైవిధ్యభరితమైన నటనతోనే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్‌పై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫోటోను షేర్ చేస్తూ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. “నాయకుడికి అన్నీ తెలుసు. ఆయన మాటే శాసనం. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, ప్రశ్నించకుండా నాయకుడి మాటను అనుసరించండి” అని ఆ పోస్ట్‌లో నాగబాబు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. “మీ సందేహాలను పక్కనపెట్టి మౌనంగా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? మేం మౌనంగా బతకడానికి జంతువులం కాదు. ఇలాంటి బెదిరింపు ధోరణులు వద్దు. ప్రశ్నించడం అనేది పౌరుడిగా మా హక్కు. ఏ నాయకుడైనా, తానే సుప్రీం అనుకునే ఏ లీడర్ అయినా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో గుడ్డిగా అనుసరించడం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు… బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం… https://t.co/d3Y4nX5XkT
— Prakash Raj (@prakashraaj) June 6, 2026
ఇదిలా ఉంటే.. అంతకుముందు సోషల్ మీడియా వేదికగా “జస్ట్ ఆస్కింగ్” (#JustAsking) అంటూ రాజకీయ, సామాజిక అంశాలపై నిలదీసే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. “మీరొస్తామంటే మేమొద్దంటామా.. రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా?.. పొత్తుతో వస్తున్నారా?.. సింగిల్ గా వస్తున్నారా? చెప్పి రండి” అంటూ సెటైర్లు వేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌ను తన దేవుడిగా భావించే ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ పోస్ట్‌పై అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌ను ట్యాగ్ చేస్తూ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. “ఒరేయ్.. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా.. తెలుగోడివా.. కన్నడోడివా? నీ ఊరు ఏది.. నీ కథ ఏంటి? నీ బతుక్కి పని లేకపోతే చూస్కో, అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి” అంటూ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ట్విట్టర్ (ఎక్స్) వేదికగానే కాకుండా, ఆ తర్వాత పలు ప్రముఖ న్యూస్ ఛానళ్ల డిబేట్లలో కూడా పాల్గొన్న బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్‌తో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ఈ ‘ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్’ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













