విగ్ యాంగిల్ చాలా మంది యువతలో చర్చనీయాంశం అయింది. బాహ్య సౌందర్యం మీద అతిగా ఆధారపడటం, సంబంధాల్లో నిజాయితీ లేకపోవడం వంటి సమస్యలు హైలైట్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యువకులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బట్టతల వస్తోంది. అందుకు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, టెన్షన్స్, లైఫ్ స్టైల్ మార్పులు కారణం అవుతున్నాయి. విగ్ వాడటం ద్వారా.. చాలా మంది కవర్ చేసుకుంటున్నారు. అదేమీ తప్పు కాదు. సినిమాల్లో ఎంతో మంది హీరోలు విగ్ వాడుతున్నారు. వారిని కోట్లమంది అభిమానిస్తున్నారు. మరి సియా.. విగ్ కారణంతోనే హత్య చేసి ఉంటుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.













