Qatar gas plant explosion: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు.. చమురు మార్కెట్లపై ప్రభావం | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Qatar gas plant explosion: గల్లంతైన కార్మికుల కోసం ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు, పౌర రక్షణ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఖతార్‌లోని అత్యంత కీలకమైన రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బర్జాన్ గ్యాస్ ప్లాంట్‌లో ఆదివారం (జూన్ 21) అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ అత్యంత విషాదకర ప్రమాదంలో కనీసం 54 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, మరో 18 మంది ఆచూకీ గల్లంతైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గ్యాస్ సరఫరా కేంద్రంలో కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించే క్రమంలో సాంకేతిక లోపం తలెత్తి ఈ భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంధన సంస్థ ‘ఖతార్ ఎనర్జీ’ ధృవీకరించాయి. గల్లంతైన కార్మికుల కోసం ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు, పౌర రక్షణ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు:

ఇటీవల కాలంలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య జరిగిన ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేసింది. ఈ ఘర్షణల మధ్య, ఇరాన్ దళాలు (IRGC) మార్చి నెలలో ఈ రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల వల్ల గ్యాస్ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిని, ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా నిలిచిపోయింది. అయితే, కొన్నిరోజుల కిందట రెండు దేశాల మధ్యా పరిస్థితులు సద్దుమణగడంతో, ఆగిపోయిన LNG ఉత్పత్తిని తిరిగి ప్రారంభించేందుకు ఖతార్‌ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్లాంట్‌ కార్యకలాపాలను మళ్లీ స్టార్ట్ చేస్తుండగా దురదృష్టవశాత్తూ ఈ భారీ పేలుడు సంభవించిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

ఖతార్ రాజధాని దోహా నగరానికి ఈశాన్యంగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో ఈ రాస్ లఫాన్ పారిశ్రామిక నగరం ఉంది. ఆసియా, ఐరోపా ఖండాలలోని దేశాలకు ఇంధన ఎగుమతులు చేయడానికి భౌగోళికంగా ఇది అత్యంత అనువైన, వ్యూహాత్మక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ గ్యాస్ క్షేత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలకు పైగా LNG ఎగుమతి అవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియా, భారతదేశం, చైనా, యూరప్ దేశాలకు ఇక్కడి నుంచే అత్యధికంగా గ్యాస్ సరఫరా జరుగుతుందని ది హిందూ రిపోర్ట్ చేసింది. రోజుకు సుమారు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ల సామర్థ్యం ఉన్న ఈ బర్జాన్ గ్యాస్ ప్లాంట్.. ఖతార్ దేశీయ విద్యుత్ ఉత్పత్తికీ, కీలకమైన నీటి శుద్ధి (Desalination) కర్మాగారాలకు ఎంతో అవసరం.

భారతదేశంపై ఈ ప్రమాద ప్రభావం ఎలా ఉండనుంది?:

భారతదేశ ఇంధన భద్రతలో ఖతార్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. దేశానికి అవసరమైన ఎల్ఎన్జీ (LNG) దిగుమతుల్లో సుమారు 40 నుండి 47 శాతం వరకు ఖతార్ నుంచే వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి ద్వారా వస్తున్నాయి. ఇంధన భద్రతను పటిష్టం చేసుకునే దిశగా భారత్, ఖతార్ దేశాల మధ్య 2024లో 78 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 లక్షల కోట్లు) భారీ విలువైన దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం 2028వ సంవత్సరం నుంచి రాబోయే 20 ఏళ్ల పాటు ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఖతార్ సంస్థలు భారత్‌కు నిరంతరాయంగా సరఫరా చేయాల్సి ఉంటుందని ఈనాడు రిపోర్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి: Secret Affairs: భారత్‌లోని ఈ నగరాల్లో రహస్య ఎఫైర్లు ఎక్కువ.. టాప్‌లో ఏ నగరం ఉందో తెలుసా!

ఖతార్ ఎల్ఎన్జీ అనేది భారతదేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువుల తయారీ, అనేక భారీ పరిశ్రమలు, గృహ అవసరాలకు అత్యంత కీలకం. అమెరికా లేదా ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే, భౌగోళిక సామీప్యత కారణంగా ఖతార్ నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం రవాణా పరంగా చాలా చౌక, సురక్షితం. ఇలాంటి కీలకమైన గ్యాస్ ఎగుమతి కేంద్రంలో వరుస ప్రమాదాలు జరగడం అనేది భవిష్యత్తులో గ్యాస్ సరఫరాలపై ప్రభావం చూపుతుందని ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports