పునరాభివృద్ధిలో భాగంగా స్టేషన్ భవనానికి ఆధునిక రూపాన్ని తీసుకొస్తున్నారు. ఆకర్షణీయమైన ఫాసాడ్, మెరుగైన ప్రవేశ మార్గాలు, ఆధునిక రూఫింగ్, ఫ్లోరింగ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ పరిసరాలను కూడా మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలు మరింత సులభంగా సాగేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మిస్తున్నారు. అదనంగా ర్యాంపులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ప్రయాణికులు ప్లాట్‌ఫారాల మధ్య సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రాకపోకల ప్రాంతాన్ని మరింత క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడం, అక్కడి నుంచి బయటకు వెళ్లడం సులభంగా ఉండేలా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. స్టేషన్ పరిసరాల్లో ల్యాండ్‌స్కేపింగ్, ప్రయాణికులకు అనుకూలమైన సూచికలు, రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు వంటి సదుపాయాలను కూడా కల్పించనున్నారు. (image: X / G Kishan Reddy)













