Rajinikanth vs Vijay: విజయ్ సీఎం అయితే.. అసూయ లేదు: రజనీకాంత్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

విజయ్ సీఎం అయితే.. అసూయ లేదు: రజనీకాంత్


Last Updated:

Rajinikanth: విజయ్‌పై అంచనాలు తక్కువగా ఉన్నాయన్న రజనీకాంత్.. తాను పార్టీ పెట్టి ఉంటే.. కచ్చితంగా గెలిచేవాణ్ని అన్నారు.

విజయ్ సీఎం అయితే.. అసూయ లేదు: రజనీకాంత్
విజయ్ సీఎం అయితే.. అసూయ లేదు: రజనీకాంత్

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ని కలిసిన సందర్భంగా.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ సీఎం అయితే తనకు ఎలాంటి అసూయా లేదన్నారు. విజయ్ తనకు సమవుజ్జీ కాదు అన్నారు. అదే కమలహాసన్ గనుక సీఎం అయివుంటే.. తాను అసూయ పడేవాడిని అన్నారు.

తాను రాజకీయ పార్టీ పెట్టి ఉంటే… సీఎం అయ్యేవాడిని అని రజనీకాంత్ అన్నారు. విజయ్‌కీ తనకూ 25 ఏళ్ల తేడా ఉందన్న రజనీకాంత్.. విజయ్ సీఎం కాకుండా తాను కుట్రలు పన్నానని వచ్చిన వార్తలను ఖండించారు. అలాంటి దురుద్దేశాలు తనకు లేవన్నారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని రజనీ అన్నారు.

ఇవి కూడా చదవండి: Gold Rate Today: రూ.16,160 తక్కువ ధరలో బంగారం.. ఇప్పుడు నగలు కొనుక్కోవచ్చా?

విజయ్‌పై అంచనాలు తక్కువగా ఉన్నాయన్న రజనీకాంత్.. తాను పార్టీ పెట్టి ఉంటే.. కచ్చితంగా గెలిచేవాణ్ని అన్నారు. తాను స్టాలిన్‌ని కలవడంలో ఎలాంటి దురుద్దేశమనూ లేదన్న రజనీకాంత్.. స్టాలిన్‌ని పరామర్శించేందుకే వచ్చానని అన్నారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చెయ్యను అన్నారు. మర్యాద కోసం విజయ్‌ని కలవాలనే ఉద్దేశం తనకు లేదని రజనీకాంత్ అన్నారు.

విజయ్ సీఎం అయ్యే ముందు.. రజనీకాంత్‌పై నెటిజన్లు ట్రోల్ చేశారు. అప్పట్లో స్టాలిన్‌ని రజనీకాంత్ కలిశారు. అప్పటికి విజయ్‌కి 10 సీట్ల కొరత ఉంది. అలాంటి సమయంలో రజనీకాంత్.. విజయ్ సీఎం అవ్వకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విమర్శలు వచ్చాయి. రజనీకాంతే.. డీఎంకే తరపున మధ్యవర్తిత్వం చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలను రజనీకాంత్ ఖండించారు.

ఇవి కూడా చదవండి: TG EAPCET Results 2026: నేడు తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports