Last Updated:
ఆ మధ్య రిలీజైన రాకా పోస్టర్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారన్న మాట వాస్తవం. ఏ అభిమాని అయినా.. బర్త్‌డేకు పోస్టర్ వస్తుందంటే ఎన్నో అంచనాలు పెట్టుకుంటుంటారు.
ఆ మధ్య రిలీజైన రాకా పోస్టర్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారన్న మాట వాస్తవం. ఏ అభిమాని అయినా.. బర్త్‌డేకు పోస్టర్ వస్తుందంటే ఎన్నో అంచనాలు పెట్టుకుంటుంటారు. చెప్పాలంటే డిఫరెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ.. అది బర్త్‌డేకే ఎందుకు రిలీజ్ చేశారని ఫ్యాన్స్ బాధ. ఇలాంటివి మిగితా రోజుల్లో రిలీజ్ చేసుంటే పండగ చేసుకునే వాళ్లు కానీ.. ఇలా బర్త్‌డేకు పోస్ట్ చేయడం కాస్త నిరాశ పెట్టింది. అదే సినిమాలో మరో స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ వదిలినా బాగుండేది కాస్త ఫీలయ్యారు. ఏది ఏమైనా పోస్టర్ మాత్రం ఇండియాను షేక్ చేసింది. అసలు అల్లు అర్జున్ ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాడ్రా బాబూ అని తలలు పీక్కున్నారు. మరోవైపు ఫస్ట్ లుక్ పోస్టర్లో ఇంచు ఇంచు అనాలసిస్ చేస్తూ.. నెటిజన్లు ఎవరీ థియరీ వాళ్లు అల్లుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ను ఏకంగా ఎగిరే ఫ్లైట్‌లో ప్లాన్ చేశాడట అట్లీ. అంతేకాకుండా ఆ ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్‌కు మెంటలెక్కిపోవడం ఖాయం. మేయిన్ ట్విస్ట్‌కు లీడ్‌గా ఈ ఫైట్ ఉంటుందట. అసలు స్క్రీన్‌పై విజువల్‌గా ఈ ఫైట్ చూస్తున్నంత సేపు హాలీవుడ్ రేంజ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందట.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని కూడా పలు రూమర్స్ వచ్చాయి. ఇక ‘పుష్ప2’ లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత అల్లు అర్జున్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ఒక్క బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు. యావత్ సినీ లవర్స్ తెగ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూశారు. నిజానికి పుష్ప2 తర్వాత అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. అది కూడా మైథలాజికల్ సబ్జెక్ట్‌తో. అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట భారీగా అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ ఏమైందో తెలియదు మధ్యలోకి అట్లీ రయ్యుమని దూసుకొచ్చాడు.
అసలు చూస్తుండగానే కథ ఓకే అవ్వడం.. పట్టాలెక్కడం జరిగిపోయింది. లాస్ట్ ఇయర్ బన్నీ బర్త్‌డేకు స్పెషల్ వీడియో రిలీజ్ చేసి.. ఇండియా మొత్తాన్ని ఈ సినిమా వైపు చూసుకునేలా చేశారు మేకర్స్. అట్లీతో ఏం సినిమా చేస్తున్నావ్ అన్న అంటూ బన్నీ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. అసలు ఆ ఒక్క వీడియోతో హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తున్నారు అని ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ ఏడాది బర్త్‌డేకు ఏకంగా టైటిల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
రాకా అంటూ అర్థంకాని టైటిల్‌తో ఆడియెన్స్‌ను కన్ఫ్యూజ్ చేశారు. జెమిని, చాట్ జీపీటీ, గ్రోక్.. ఇలా అన్నిటికి రాకా అర్థం ఏంటో చెప్పమని సావగొట్టేశారు మన టాలీవుడ్ సినీ లవర్స్. అయితే ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా విలన్‌గా కూడా బన్నీనే యాక్టింగ్ చేస్తున్నాడు. దాంతో అది విలన్ లుక్ అని అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా ఒక్క టైటిల్ పోస్టర్‌తోనే ప్రకంపనలు సృష్టించారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













