Ram Charan: పెద్ది తర్వాత రామ్ చరణ్ బిగ్ స్టెప్.. ఇంత డేరింగ్ డిసీషన్ తీసుకున్నాడేంటి మావ!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పెద్ది మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న కొత్త ప్రాజెక్టు గురించి బయటకొస్తున్న వార్తలు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వైరల్ అవుతోంది.

News18
News18

ఈ ఏడాది ‘పెద్ది’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చరణ్, రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి ప్రాజెక్ట్ (RC17) కోసం సన్నద్ధమవుతున్నారు. మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చే వార్త ఏమిటంటే, తన కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘రంగస్థలం’ చిత్ర దర్శకుడు సుకుమార్‌తో ఆయన మరోసారి చేతులు కలుపుతున్నారు. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్ వర్గాలతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పల్లెటూరి నేపథ్యంలో చిట్టిబాబుగా చరణ్ నట విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సుకుమార్.. ఈసారి దానికి పూర్తి భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆర్సీ17 ఒక సరికొత్త అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన మేకోవర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ‘పెద్ది’ చిత్రంలో రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో అలరించిన చరణ్.. ఆర్సీ17 కోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గి, ఎంతో స్లిమ్‌గా, మునుపెన్నడూ చూడని స్టైలిష్ అర్బన్ లుక్‌లో కనిపించబోతున్నారట. ప్రస్తుతం చరణ్ ఈ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం కఠినమైన వర్కౌట్స్, డైట్ పాటిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20న లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సుకుమార్ గత చిత్రాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీ జాతీయ స్థాయిలో సృష్టించిన సంచలనం తెలిసిందే. దానికి రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ తోడవడంతో ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports