Last Updated:
సినిమా సక్సెస్ అంటే కేవలం కలెక్షన్స్ కాదంటున్నారు రామ్ చరణ్. తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ఆయన క్రేజీ కామెంట్స్ చేశారు.
మెగా పవర్ స్టార్, గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ (Ram Charan) తన మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ప్రపంచవ్యాప్త విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ అంతర్జాతీయ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్.. నటీనటుల కెరీర్లో బాక్సాఫీసు వసూళ్ల ప్రాముఖ్యత, వాటి ప్రభావంపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్లు అనేవి ఒక నటుడి తదుపరి అడుగులను ఎలా శాసిస్తాయో చరణ్ స్పష్టం చేశారు. “మంచి బాక్సాఫీస్ నంబర్లు మన తదుపరి సినిమాలను, వాటి బడ్జెట్ పరిధిని నిర్ణయిస్తాయి. వసూళ్లు బాగుంటేనే రాబోయే చిత్రాల్లో మరిన్ని కొత్త ప్రయోగాలు చేసేందుకు, విభిన్నమైన కథలను ఎంచుకునేందుకు నిర్మాతలకు నమ్మకం, నటీనటులకు అవకాశం లభిస్తుంది. అందుకే కమర్షియల్‌గా బాక్సాఫీస్ నంబర్లు చాలా ముఖ్యమే.. అలా అని కేవలం ఆ అంకెలు ఒక్కటే సినిమా అసలైన విజయానికి సంపూర్ణ కొలమానం కాలేవు” అని రామ్ చరణ్ చాలా పరిణతితో కూడిన విశ్లేషణ ఇచ్చారు. కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే కంటెంట్ కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
రన్ టైమ్ పరంగా దాదాపు 3 గంటల 9 నిమిషాల నిడివితో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఏఆర్ రెహమాన్ సంగీతంలోని ‘హల్లాళ్లాలో’ మాస్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఒక పల్లెటూరి యువకుడు క్రికెట్, కుస్తీ వంటి క్రీడల నేపథ్యంలో సాగించే భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్రం. ఒకవైపు భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, రామ్ చరణ్ మాత్రం కలెక్షన్ల లెక్కల కంటే కథలోని బలమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని నమ్ముతున్నారు. ఈ చిత్రం ద్వారా చరణ్ తన కెరీర్లో మరో భారీ కమర్షియల్ మైలురాయిని అందుకోవడమే కాకుండా, తన నటనతో సరికొత్త ప్రయోగానికి తెరలేపబోతున్నారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













