Ramayana Actors Remunerations: ‘రామాయణ’ యాక్టర్స్ రెమ్యూనరేషన్స్.. ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో తెలుసా..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణం’ (Ramayana). భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణం’ (Ramayana). ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల అగ్ర తారల కలయికతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నిర్మాణ వ్యయం (బడ్జెట్) ఏకంగా రూ. 4,000 కోట్లు అని తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలు, వరల్డ్ క్లాస్ వీఎఫ్‌ఎక్స్ (VFX) తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *