Ramayana Movie Trailer: ‘రామాయణ’ మూవీ ట్రైలర్ లీక్.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. రాసిపెట్టుకోండి ఇది పక్కా రూ.2000 కోట్ల బొమ్మ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఎన్ని సార్లు చూసినా, విన్నా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే, వినాలనిపించే కథల్లో రామాయణం ఒకటి. ఇప్పటికే పదుల సంఖ్యలో రామాయణంపై సినిమాలొచ్చాయి.

News18
News18

ఎన్ని సార్లు చూసినా, విన్నా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే, వినాలనిపించే కథల్లో రామాయణం ఒకటి. ఇప్పటికే పదుల సంఖ్యలో రామాయణంపై సినిమాలొచ్చాయి. అయినా సరే మళ్లీ ఎవరైనా తీస్తున్నారంటే క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటాం. అంతలా రామాయణ కథపై జనాలకు అంతులేని ఇష్టం. తరాలు మారినా రామాయణంపై మక్కువ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. అలాంటి గొప్ప కథను అక్షరాల రూ.4000 కోట్ల ఖర్చుతో వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు నితీష్ తివారి.

రణ్‌బీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న రామాయణ సినిమా గురించి యావత్ సినిమా లవర్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా సినిమా చూస్తామా అని తెగ వేయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పుడు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి.

రీసెంట్‌గా రామాయణ మూవీ మేకర్స్ ప్రథమ్ సంకల్ప్ పేరుతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా 3 నిమిషాల నిడివి గల ట్రైలర్‌ను చూపించారు. అయితే.. దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఒక్కో షాట్ అరాచకం అంతే. అసలు రాముడి గెటప్‌లో రణ్‌బీర్ ఒదిగిపోయాడు. జటాయువు సీన్, సాయి పల్లవిపై సీన్లు.. ఇలా కొన్ని షాట్స్ మైండ్ బ్లోయింగ్ అంతే.

ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 24న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. రామాయణ సినిమాను మూడు పార్టులుగా నితీష్ తెరెక్కిస్తున్నాడు. ఈ మూడు పార్టుల బడ్జెట్ అక్షరాల రూ.4000 కోట్లు. ఇంత బడ్జెట్‌తో ఏ రేంజ్‌లో అవుట్ పుట్ ఉంటుందో అని సినీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా కేవలం రెమ్యూనరేషన్‌లకే దాదాపు రూ.500 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రావణాసురిగా నటిస్తూనే.. సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు యష్. ఇక సీతగా సాయి పల్లవి నటించనుండగా.. రావణాసురిడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది.

రామ, రావణ యుద్దానికి కారణమైన శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి క్రేజీ యాక్టర్లతో రామాయణ సినిమాపై క్రేజ్ మాములుగా లేదు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దీపావళి పండగ సందర్భంగా నవంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed