Last Updated:
నవంబర్ 6న ‘రామాయణ’ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఇక భారతదేశంలో మాత్రం ఈ డేట్ లో రిలీజ్ ఉండదని పేర్కొంటూ కొత్త డేట్ చెప్పారు.
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్ నుంచి అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). పాన్ ఇండియా స్థాయిని దాటి, గ్లోబల్ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు. భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని దేశీయ మార్కెట్ కంటే ముందుగా అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసేందుకు వినూత్న వ్యూహాన్ని రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.














