Last Updated:
Ramayana Trailer:ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామాయణం ట్రైలర్ సరికొత్త ఒరవడికి తెరలేపింది. భారత చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మముహూర్తంలో విడుదల చేశారు. జూలై 30 తెల్లవారుజాము 4:15 గంటలకు రామాయణం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రామాయణం ట్రైలర్ విడుదలైంది. చాలా రోజులుగా ట్రైలర్ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం చిత్ర యూనిట్ పూనకాలు తెప్పించే ట్రైలర్‌తో ముందుకు వచ్చింది. రామాయణం అందరికీ తెలిసిన స్టోరీనే.. అయినప్పటికీ గ్రాండ్ విజువల్స్‌తో ట్రైలర్‌ను ముందుకు తీసుకొచ్చింది. 4 నిమిషాలపైనే ఉన్న ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటి వరకు రావణుడి క్యారెక్టర్‌ను దాచిపెడుతూ వచ్చిన మేకర్స్ ట్రైలర్‌లో రివీల్ చేశారు. యశ్ రావణుడిగా ఒదిగిపోయాడు. ఇక రాముడిగా రణబీర్ కపూర్ సౌమ్యంతో కూడిన నటన ఆకట్టుకుంది. సీతగా సాయిపల్లవి మెప్పించింది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కడా ఖర్చుకు వెనక్కి తగ్గకుండా హాలివుడ్ రేంజ్‌లో ఈ మూవీని నిర్మించాడు. హాన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి ప్రాణం పోసింది.
మన పురాణాలను నేటి పిల్లలకు పరిచయం చేస్తూ ఈ మూవీని తీసినట్లుగా అనిపించింది. పలుమార్లు ట్రైలర్ వాయిదా పడ్డప్పటికీ.. తాజాగా రిలీజ్ అయిన ప్రచార చిత్రం సినీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ను మీరూ చూసేయండి
నితేశ్ తివారీ దర్శకత్వంలో భారీ వ్యయంతో రెండు భాగాలుగా రామాయణంను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. రామాయణం పార్ట్ 1ను ఈ ఏడాది నవంబర్ 6న దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ట్రైలర్‌లో రావణుడు ఇంద్రుడితో యుద్ధం.. అలాగే రాముడి స్వయంవరం.. కైకేయి కోరిక.. ఆ తర్వాత వనవాసం.. మనకు తెలిసిన కథే అయినా విజువల్స్ మాత్రం గ్రాండ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే అవకాశం ఉంది. వనవాసంలో ఉన్న సీతారాముల దగ్గరకు సూర్పనక రావడం వంటి వాటిని కూడా ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌తో అయితే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














