Ramayana Trailer: రామాయణ టీమ్ బిగ్ అనౌన్స్‌మెంట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు భారీ విజువల్ వండర్ రామాయణ. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

News18
News18

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్-ఇండియన్ ప్రాజెక్టులలో ‘రామాయణ’ (Ramayana) ముందు వరుసలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి అత్యంత భారీ బడ్జెట్ తో ఒక బిగ్గెస్ట్ ఫాంటసీ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రపంచస్థాయి హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ తో, భారతీయ వెండితెరపై మునుపెన్నడూ చూడని రీతిలో మన ఇతిహాసాన్ని ఆవిష్కరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

పుకార్లకు చెక్ పెట్టిన మేకర్స్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

గత కొద్ది రోజులుగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించి నెట్టింట ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ గ్లోబల్ పాప్-కల్చర్ ఈవెంట్ ‘శాన్ డియాగో కామిక్-కాన్’ (Comic-Con) వేదికగా జూలై 18న ఈ చిత్ర గ్లింప్స్ లేదా ట్రైలర్ ను లాంచ్ చేస్తారని బలమైన పుకార్లు వినిపించాయి. అయితే, తాజాగా ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఆ పుకార్లకు అధికారికంగా చెక్ పెడుతూ.. ‘రామాయణ’ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ప్రీమియర్ ను జూలై 24న గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

వనవాసానికి పయనమైన సీతారాములు:

ఈ ట్రైలర్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మేకర్స్ వదిలిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయోధ్య నగరం నుండి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు తమ 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరుతున్న ఘట్టాన్ని ఈ పోస్టర్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ పోస్టర్ లోని ఎమోషన్, బ్యాక్ గ్రౌండ్ లోని అయోధ్య సెటప్ చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందోనని అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

హాలీవుడ్ స్థాయి మేకింగ్, భారీ తారాగణం:

ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన సాంకేతిక విషయం ఏమిటంటే.. భారతీయ సినిమా చరిత్రలో మొదటిసారిగా పూర్తిగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్ లో చిత్రీకరించబడుతున్న సినిమా ఇది. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ DNEG (నమిత్ మల్హోత్రా) ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ, అవతార్, మార్వెల్ సినిమాల రేంజ్ లో గ్రాఫిక్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఎపిక్ మూవీలో కేజీఎఫ్ స్టార్ యష్ రావణాసురుడిగా, బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారని సమాచారం.

మొత్తానికి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు వస్తున్న ఈ ‘రామాయణ’ విజువల్ ఎపిక్ జూలై 24 ట్రైలర్ లాంచ్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాలోని అసలు విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే ఆ బిగ్ డే వరకు ఆగాల్సిందే.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports