Last Updated:
విలక్షణ నటుడిగా, స్టైలిష్ పర్సనాలిటీతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు రషీన్ రహ్మాన్ (Rahman) పుట్టినరోజు నేడు (మే 23). ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న సరికొత్త చిత్రం నుండి మేకర్స్ ఒక పవర్‌ఫుల్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలలో విలక్షణ నటుడిగా, స్టైలిష్ పర్సనాలిటీతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు రషీన్ రహ్మాన్ (Rahman) పుట్టినరోజు నేడు (మే 23). ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న సరికొత్త చిత్రం నుండి మేకర్స్ ఒక పవర్‌ఫుల్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ప్రొడక్షన్ నెం. 1’ చిత్రం నుండి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది.
తాజాగా విడుదలైన ఈ బర్త్‌డే పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇందులో రహ్మాన్ లుక్ ఎంతో ఎలిగెంట్‌గా, అంతే పవర్‌ఫుల్‌గా ఉంది. ఆయన పాత్ర చుట్టూ ఉన్న రహస్యాన్ని, ఆ క్యారెక్టర్ యొక్క తీవ్రతను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. కేవలం ఒక పోస్టర్‌తోనే సినిమాలో రహ్మాన్ పాత్ర ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండబోతోందో చిత్రబృందం హింట్ ఇచ్చింది. ఇది ఒక ఉత్కంఠభరితమైన సినీ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.
1987లో విడుదలైన ‘రాగలీల’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రహ్మాన్.. ఆ తర్వాత తనదైన నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘భారత్ బంద్’, ‘ప్రియతమా’ వంటి చిత్రాలతో మెప్పించిన ఆయన.. ప్రభాస్ బిల్లా చిత్రంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా, నందమూరి బాలకృష్ణ ‘సింహా’ (Simha) చిత్రంలో జగపతిబాబు తమ్ముడిగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఇటీవల శర్వానంద్ ‘ఒక ఒక లోకం నువ్వే’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం రహ్మాన్ పుట్టినరోజు పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ ‘ప్రొడక్షన్ నెం. 1’ చిత్రం రహ్మాన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













