Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్నా? సాయి పల్లవిని కాదని నేషనల్ క్రష్‌ని పెట్టడానికి కారణం ఇదే | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా నటించనున్నట్లు వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

News18
News18

భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్‌పై గత కొంతకాలంగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్నమూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె నివాసంలో ప్రత్యేకంగా లుక్ టెస్ట్ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ బయోపిక్‌కు సంబంధించి గతంలో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. మొదట ఈ పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె కర్ణాటక సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడం కోసం ఎంఎస్ సుబ్బులక్ష్మికి సంబంధించిన వీడియోలు, పాత రికార్డింగ్స్‌ను అధ్యయనం చేస్తున్నట్లు కూడా అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్టులో మరో నటి రుక్మిణి వసంత్ పేరు కూడా వినిపించింది. సాయి పల్లవి స్థానంలో రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇప్పుడు తాజాగా రష్మిక మందన్నా పేరు తెరపైకి రావడంతో ఈ బయోపిక్‌పై అంచనాలు మరింత పెరిగాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక, ఈ పాత్రకు ఎంపికైతే ఆమె కెరీర్‌లో ఇది మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి సంగీత దిగ్గజం పాత్రను పోషించడం ఏ నటికైనా సవాలుతో కూడుకున్న విషయమే.

ఇదిలా ఉండగా, రష్మిక ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన కాక్‌టెయిల్ 2 ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ట్రైలర్‌కు లభించిన ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని పేర్కొంది.

అయితే ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నిజంగా ఎవరు నటించబోతున్నారు? రష్మికా, సాయి పల్లవినా లేదా రుక్మిణి వసంతా? అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports