Rashmika Mandanna: స్టేజ్‌పై హీరోయిన్‌ మీద చేయి వేసిన హీరో.. ఇదేం పని అంటూ నెట్టింట వైరల్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘కాక్‌టెయిల్ 2’ ప్రమోషన్స్‌లో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా మధ్య జరిగిన వైరల్ ఘటనపై తాజాగా ఇద్దరూ సరదాగా స్పందించారు. దీంతో సోషల్ మీడియాలో జరిగిన ఊహాగానాలకు చెక్ పడింది.

News18
News18

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కాక్‌టెయిల్ 2’ ఒకటి. షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే ఇటీవల సినిమా ప్రమోషన్స్ కంటే ఎక్కువగా షాహిద్ కపూర్, రష్మిక మందన్నాల మధ్య జరిగిన ఓ చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

కొద్ది రోజుల క్రితం ముంబైలో నిర్వహించిన ‘కాక్‌టెయిల్ 2’ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తున్న సమయంలో షాహిద్ కపూర్ తన చేయిని రష్మిక భుజంపై ఉంచారు. అదే సమయంలో రష్మిక కాస్త వెనక్కి తగ్గినట్లు వీడియోలో కనిపించింది. ఈ చిన్న క్షణమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్మిక అసౌకర్యంగా ఫీల్ అయ్యిందా? ఇద్దరి మధ్య ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా జరిగిన మరో ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ వివాదానికి స్వయంగా షాహిద్, రష్మిక ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మే 29న జరిగిన కార్యక్రమంలో ముగ్గురు హీరోహీరోయిన్లు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈసారి ఫొటోలు దిగుతున్న సమయంలో షాహిద్ సరదాగా రష్మిక నుంచి కొంచెం దూరంగా నిలబడ్డారు. గత వైరల్ ఘటనను ఉద్దేశించి చేసిన ఈ ఫన్నీ రియాక్షన్‌తో అక్కడ ఉన్న కృతి సనన్ నవ్వులు చిందించింది.

రష్మిక ఈ సరదా వ్యాఖ్యలను చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. వీడియోల్లో ఆమె షాహిద్‌తో మాట్లాడుతూ “అలా నేను ఏమీ ఉద్దేశించలేదు” అన్నట్లు వినిపించింది. దీంతో గతంలో వైరల్ అయిన వీడియోపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్టయింది. సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఈ సంఘటనను చాలా లైట్‌గా తీసుకుంటూ, ఇద్దరి మధ్య మంచి స్నేహపూర్వక అనుబంధం ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ‘కాక్‌టెయిల్ 2’ మరో కారణంతో వార్తల్లో నిలిచింది. ఇటీవల విడుదలైన ‘మషూకా’ పాటపై కొంతమంది నెటిజన్లు కాపీ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ పాట ట్యూన్ 1993లో వచ్చిన ఓ ఇటాలియన్ సాంగ్‌ను పోలి ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సంగీత దర్శకుడు ప్రీతమ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పాట విడుదలైనప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం పరిపాటిగా మారిందని, ఊహాత్మక పోలికలు చూపించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కిస్తున్న ‘కాక్‌టెయిల్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 2012లో విడుదలైన ‘కాక్‌టెయిల్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. తొలి భాగంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ నటించగా, ఇప్పుడు షాహిద్, రష్మిక, కృతి సనన్ కొత్త త్రయంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

సినిమా విడుదలకు ముందు వైరల్ వీడియోలతో చర్చనీయాంశమైన ఈ జంట, తాజా ప్రమోషన్లతో అన్ని అపోహలను తొలగించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ‘కాక్‌టెయిల్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports