పశ్చిమ బెంగాల్ తిరుగుబాటు: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోని అంతర్గత కలహాలు ఇప్పుడు పూర్తిగా అదుపుతప్పాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, పార్టీ నాయకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కోల్‌కతాలోని రాణి రస్మోని అవెన్యూలో వీధి పోరాటానికి దిగిన మమతా బెనర్జీ, ఇప్పుడు తన సొంత పార్టీలోనే ఒంటరి అయిపోయారు. మంగళవారం నిర్వహించిన ఈ ‘మహాధర్నా’ టీఎంసీలోని తీవ్రమైన అంతర్గత కలహాలను ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంటులో 29 మంది ఎంపీలు ఉన్న ఈ పార్టీలో,.. మహాధర్నాలో మమతా బెనర్జీతో కలిసి వేదిక పంచుకోవడానికి కేవలం 7గురు ఎమ్మెల్యేలు, కొద్దిమంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారు.













