RC17: రంగంలోకి నయనతార.. సుకుమార్- రామ్ చరణ్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్- రామ్ చరణ్ కాంబోలో మరో కొత్త సినిమా రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారం బయటకొచ్చింది.

News18
News18

‘రంగస్థలం’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్‌లో 17వ (RC17) చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకోగా, మరోవైపు విజువల్స్, లొకేషన్ల ఎంపిక వంటి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అత్యంత కీలకమైన పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ సమాచారం. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలే కాకుండా సహాయక పాత్రలు సైతం కథను మలుపు తిప్పేంత పవర్ ఫుల్ గా, విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే RC17లో నయనతార కోసం సుకుమార్ ఒక అద్భుతమైన, బలమైన క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె కథకు వెన్నెముక లాంటి పాత్రలో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని ఇండస్ట్రీ టాక్.

అన్ని పనులు పూర్తి చేసి ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ నెలలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రంగస్థలంలో ‘చిట్టిబాబు’ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ తర్వాత చరణ్ ను సుకుమార్ ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఉన్నారు.

నయనతార విషయానికొస్తే.. ఇటీవల కాలంలో ఈ లేడీ సూపర్ స్టార్, క్యారెక్టర్‌‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ ‘గాడ్ ఫాదర్’లో నటించిన ఆమె.. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుకుమార్-చరణ్ కాంబోలో కూడా ఆమె భాగం కానుండటంతో ప్రాజెక్టుపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports