RCB vs GT Qualifier 1: ఆర్సీబీ అదరహో.. గుజరాత్‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్లో ఎంట్రీ | క్రీడా వార్తలు | ACTPnews

PC : IPL


Last Updated:

ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT vs RCB)తో జరిగిన పోరులో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఫైనల్లో ప్రవేశించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది.

PC : IPL
PC : IPL

RCB vs GT Qualifier 1: ఐపీఎల్ 2026 (IPL 2026)లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs GT) ఫైనల్లో ప్రవేశించింది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT vs RCB)తో జరిగిన పోరులో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఫైనల్లో ప్రవేశించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162పరుగులకు ఆలౌటైంది. ఒక్కరు కూడా నిలబడి ఆడలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో డఫ్పీ 3 వికెట్లతో మెరిశాడు. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, రసిక్ సలాంలకు తలా 2 వికెట్లు లభించాయి. గుజరాత్ బ్యాటర్లలో తెవాటియా (68) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బట్లర్ (29) మినహా మిగిలిన వారు అలా ఇచ్చి ఇలా వెళ్లారు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు గుజరాత్ టైటాన్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో గెలిస్తే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుతుంది.

భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. సాయి సుదర్శన్ (14), శుబ్‌మన్ గిల్ (2), సింధు (5), సుందర్ (8), హోల్డర్ (0) అలా వచ్చి ఇలా వెళ్లారు. డఫీ బౌలింగ్‌లో ఆడేందుకు గుజరాత్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఆర్సీబీ 2025లో చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఫైనల్ చేరింది. 2018 నుంచి క్వాలిఫయర్ 1 విజేతే ఐపీఎల్ టైటిల్ నెగ్గుతూ వస్తోంది. అదే జరిగితే ఈసారి కప్పు ఆర్సీబీదే.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిధార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) రెచ్చిపోయాడు. విరాట్ కోహ్లీ (43), పడిక్కల్ (30), కృనాల్ పాండ్యా (43) రాణించారు. ఫలితంగా ఆర్సీబీ భారీ స్కోరును సాధించింది. కగిసో రబడ, హోల్డర్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.ప్రసిధ్ కృష్ణకు ఒక వికెట్ లభించింది. ప్లే ఆఫ్స్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభం లభించింది.  పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోయి 76 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ దంచి కొట్టారు. ఫలితంగా ఆర్సీబీ తొలి 6 ఓవర్లలో అదరగొట్టింది. అయితే 9వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన జేసన్ హోల్డర్ 3 బంతుల్లో కోహ్లీ, పడిక్కల్‌లను అవుట్ చేశాడు. దాంతో ఆర్సీబీ 7 నుంచి 10 ఓవర్ల మధ్య కేవలం 23 పరుగులు చేసింది.

అయితే ఇక్కడి నుంచి పరిస్థితులు మారిపోయాయి. క్రీజులోకి వచ్చిన రజత్ పటిధార్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ పలు క్యాచ్‌లను డ్రాప్ చేసింది. రజత్ పటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను రబడ మిస్ చేశాడు. అనంతరం అతడు రెచ్చిపోయి ఆడాడు. కృనాల్ పాండ్యా కూడా అతడికి చక్కటి సహకారం అందించాడు. ఫలితంగా ఆర్సీబీ చివరి 10 ఓవర్లలో ఏకంగా 155 పరుగులు చేసింది. ఫలితంగా క్వాలిఫయర్ 1 పోరులో తిరుగులేని టార్గెట్‌ను గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *