RDT Funds Restart: రాయలసీమలోని ఆ జిల్లా ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తృతం | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews

Rural


Last Updated:

RDT Funds Restart: సంవత్సరం తర్వాత ఎఫ్ సి ఆర్ ఏ నిధులను తిరిగి మళ్ళీ అమలు చేస్తూ కేంద్రం ప్రకటించిన వార్త తెలియగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

+

Rural Development Trust services

RDT Funds Restart:  కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(RDT) చేస్తున్న సేవలు వర్ణనాతీతం. అయితే గత సంవత్సరం ఆర్డీటీ సంస్థ నిధులను కేంద్రం ఆపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు జరిగాయి. అయితే సంవత్సరం తర్వాత ఎఫ్ సి ఆర్ ఏ నిధులను తిరిగి మళ్ళీ అమలు చేస్తూ కేంద్రం ప్రకటించిన వార్త తెలియగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

కేంద్రం తీపి కబురు..

ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి విదేశాలనుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన అనుమతులను ఎఫ్సీఆర్ఎ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) కింద నిలిపివేస్తూ ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆ సంస్థ ఎఫ్సీ (ఫారిన్ కాంట్రిబ్యూషన్) ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడానికి ఆటంకం ఏర్పడింది. ఫలితంగా ఈ సంస్థ చేపడుతున్న విద్య, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు అంతరాయం కలిగింది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి శుభవార్త రావడంతో జిల్లా ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తుంది. సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది సేవలు..

అనంతపురం జిల్లా అభివృద్ధిలో RDT (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాల్లో ఈ సంస్థ అందించే నిధులు, సేవలు సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిస్తాయి. ప్రస్తుత తరుణంలో RDT నిధుల ద్వారా అందుతున్న ప్రధాన ప్రయోజనాలు ఇవే. వ్యవసాయం ఉపాధిచెక్ డ్యామ్‌ల నిర్మాణ భూగర్భ జలాల పెంపుదల కోసం RDT నిధులు వెచ్చిస్తుంది. ఇది రైతన్నలకు సాగునీటి విషయంలో పెద్ద భరోసా. రసాయనాల్లేని సాగును ప్రోత్సహిస్తూ, రైతులకు అవసరమైన శిక్షణ, ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. విద్య నైపుణ్యాభివృద్ధి గ్రామీణ యువతకు మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా చేస్తోంది.

పేదల పాలిట వరాలు..

పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. వైద్యం ఆరోగ్యం కంటి ఆపరేషన్లతో పాటుగా వైకల్యం ఉచిత కంటి పరీక్షలు , కృత్రిమ అవయవాల పంపిణీ వంటి కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. బత్తలపల్లి కణేకల్లు వంటి ప్రాంతాల్లోని RDT ఆసుపత్రులు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నాయి. నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి RDT నిధులు కేటాయించి, సొంతింటి కల సాకారం చేస్తోంది. అయితే గత ఏడాది నుండి బ్రేక్ పడిన ఈ సేవా కార్యక్రమాలు కేంద్ర ప్రకటనతో తిరిగి కొనసాగనున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed