Regina Cassandra: రెజీనా మరీచిక మూవీ రివ్యూ.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రెజీనా కసండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరీచిక’. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

News18
News18

రెజీనా కసండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరీచిక’. సతీష్ కాసెట్టి దర్శకత్వంలో, చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ: సిటీలో కేఫే నడిపే సంజయ్ అలియాస్ సంజూ (విరాజ్ అశ్విన్)ను వెంకటలక్ష్మీ (అనుపమ పరమేశ్వరన్) అనే స్టూడెంట్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ తన ప్రేమను బయటపెట్టదు. ఇదే సమయంలో లండన్ నుంచి వచ్చిన మరీచిక (రెజీనా కసండ్రా)తో లక్ష్మీకి పరిచయం ఏర్పడుతుంది. లక్ష్మీ ద్వారానే సంజూకి మరీచిక పరిచయమవుతుంది. వాలెంటైన్స్ డే రోజున లక్ష్మీ తన ప్రేమను సంజూకి చెప్పాలనుకునే లోపే, సంజూ మరీచికకు ప్రపోజ్ చేస్తాడు. దాంతో లక్ష్మీ తన ప్రేమను త్యాగం చేసి వారిద్దరికీ పెళ్లి చేస్తుంది. అయితే, పెళ్లయ్యాక లక్ష్మీ కళ్ల ముందే సంజూని మరీచిక దారుణంగా చంపేస్తుంది. అసలు మరీచిక సంజూని ఎందుకు చంపింది? ఆమె మనిషా, దెయ్యమా? సీఐ అంజిబాబు (అజయ్ ఘోష్) ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే?

దర్శకుడు సతీష్ కాసెట్టి ఎంచుకున్న సైకలాజికల్, మర్డర్ మిస్టరీ పాయింట్ బాగానే ఉన్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో చాలావరకు తడబడ్డారు. సినిమా ప్రారంభంలో వచ్చే మర్డర్ సీన్ ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, ఆ తర్వాత కథనం బోర్ కొట్టిస్తుంది. స్క్రీన్‌ప్లే గందరగోళం వల్ల ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వలేడు. ఫస్టాఫ్ అంతా సాగదీతగా సాగగా, సెకండాఫ్‌లో దెయ్యం ఎలిమెంట్‌తో కొంత ఉత్కంఠ పెంచే ప్రయత్నం చేసినా అది ఎక్కువసేపు నిలబడలేదు. మరీచిక అసలు రూపం ఏంటనేది తేల్చే క్రమంలో ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతారు.

నటీనటుల విషయానికి వస్తే.. రెజీనా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చక్కటి నటన కనబరిచింది. అనుపమ డీ-గ్లామరైజ్డ్ రోల్‌లో మెప్పించగా, విరాజ్ అశ్విన్ తన భావోద్వేగ నటనతో ఆకట్టుకున్నాడు. అజయ్ ఘోష్ పోలీస్ పాత్రలో కాస్తో కూస్తో నవ్వించే ప్రయత్నం చేశాడు. సాంకేతికంగా చూస్తే.. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కావాల్సింది, కానీ బలహీనమైన సన్నివేశాల వల్ల ఆయన మార్కు పెద్దగా కనిపించలేదు. లక్ష్మీ భూపాల డైలాగ్స్, అరవింద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తాయి.

చివరగా.. ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అయ్యే అవకాశం ఉన్న ‘మరీచిక’.. కథనంలో స్పష్టత లేకపోవడం వల్ల నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోయింది.

రేటింగ్: 2

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports