Last Updated:
Reliance Foundation Youth Sports: అండర్-8, అండర్-10, అండర్-12 విభాగాలలోని బాలబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ 2026-27 సీజన్, వేల మంది చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పోటీ వేదికను అందిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్.
భారతదేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో రిలయన్స్ ఫౌండేషన్ తన 9వ సీజన్ యూత్ ఫుట్బాల్ టోర్నమెంట్ను అత్యంత ఘనంగా ప్రారంభించింది. ఈసారి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా దేశవ్యాప్తంగా తన పరిధిని విస్తరిస్తూ 13 ప్రధాన కేంద్రాలలో ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహిస్తోంది. అండర్-8, అండర్-10, అండర్-12 విభాగాలలోని బాలబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ 2026-27 సీజన్, వేల మంది చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పోటీ వేదికను అందిస్తోంది.














