Risk Movie Review: ‘రిస్క్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Risk Movie Review: 'రిస్క్' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు


కథ:

కార్తీక్ (సందీప్ అశ్వ) తన ముగ్గురు స్నేహితులతో కలిసి చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడని ఈ నలుగురు, మాజీ మిస్ ఇండియా సందలి అరోరా (జోయా జవేరి)కి దగ్గరయ్యేందుకు తామే ప్రముఖ మ్యూజిక్ వీడియో మేకర్లమంటూ అబద్ధం చెబుతారు.

అయితే అనుకోని విధంగా సందలి అరోరా తన భర్త ప్రదీప్ చక్రవర్తి (అనీష్ కురువిల్లా)ని హత్య చేయాలని వీరిని కోరుతుంది. దీంతో వారి జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతాయి. ఆమె తన భర్తను ఎందుకు చంపాలనుకుంటుంది? ఆ నలుగురు ఈ డీల్‌కు ఒప్పుకుంటారా? చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

ఎలా ఉంది?

సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించారు. మొదటి సన్నివేశాల నుంచే ప్రేక్షకుడిలో తర్వాత ఏమవుతుందనే ఆసక్తిని కలిగించడంలో ఆయన విజయవంతమయ్యారు. ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ సమస్యలను కథలో భాగం చేయడం మంచి ప్రయత్నంగా అనిపిస్తుంది.

ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి పెద్ద కంపెనీల్లో బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను కథలో సహజంగా చూపించారు. హీరో నిర్వహించే కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే ఎపిసోడ్లు వాస్తవ పరిస్థితులను గుర్తు చేస్తాయి. ఈ అంశాన్ని దర్శకుడు కమర్షియల్ కథతో మేళవించిన తీరు ఆకట్టుకుంటుంది.

మొదటి భాగంలో వినోదంతో పాటు కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. రెండో భాగంలో కథ మరింత ఉత్కంఠగా మారి, క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది.

నటీనటుల నటన:

హీరో సందీప్ అశ్వ తన తొలి చిత్రానికే మంచి నటన కనబరిచాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, కామెడీ సీన్లలోనూ సహజంగా నటించాడు. జోయా జవేరి పాత్ర కథకు కీలకం. గ్లామర్‌తో పాటు పాత్రలోని మిస్టరీని కూడా చక్కగా ప్రెజెంట్ చేసింది.

రాజీవ్ కనకాల పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన కనిపించే సన్నివేశాలు కథకు బలం చేకూర్చాయి. యువ నటులతో కలిసి ఆయన చేసిన సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. మిగిలిన కొత్త నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

సాంకేతిక విభాగం:

సంగీత దర్శకుడిగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఘంటాడి కృష్ణ, ఈ చిత్రంలో కూడా సంగీతంతో ఆకట్టుకున్నారు. పాటలు వినసొంపుగా ఉండటంతో పాటు నేపథ్య సంగీతం కూడా కథకు తగ్గట్టుగా సాగింది.

జగదీష్ కొమారి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కథకు తగిన మూడ్‌ను తీసుకువచ్చాయి. శివ శర్వాణి ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే సినిమా మరింత వేగంగా సాగేదనే భావన కలుగుతుంది. అయితే నిర్మాణ విలువలు మాత్రం మంచి స్థాయిలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్+

+కథ

+స్క్రీన్‌ప్లే

+రాజీవ్ కనకాల నటన

+ఘంటాడి కృష్ణ సంగీతం

+క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు

+నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్-

-కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం

-ఎడిటింగ్

చివరగా: కొత్త కథలు, థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్లు ఇష్టపడేవారికి ‘రిస్క్’ ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెప్పవచ్చు.

రేటింగ్: 2.75/5



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports